Nandamuri Balakrishna కరోనా బారిన పడ్డారు. కొద్దిరోజులగా అస్వస్థతతో ఉన్న బాలకృష్ణకు పరీక్షలు నిర్వహించగా కొవిడ్ పాజిటివ్ గా తేలింది. దీంతో ఆయన ఐసోలేషన్ లోకి వెళ్లారు. తనను గడచిన రెండు రోజులుగా కలిసినవాళ్లు పరీక్షలు చేయించుకోవాలని బాలకృష్ణ కోరారు. తన ఆరోగ్యం బాగానే ఉందన్న బాలయ్య కోలుకున్న తర్వాత తిరిగి షూటింగుల్లో పాల్గొనంటానని తెలిపారు.